నాలుకల రికార్డు | Father of three breaks Guinness World Record for the world's widest tongue | Sakshi
Sakshi News home page

నాలుకల రికార్డు

Apr 18 2015 3:41 PM | Updated on Aug 21 2018 2:34 PM

నాలుకల రికార్డు - Sakshi

నాలుకల రికార్డు

వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా..!

న్యూయార్క్: వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా..! మరి ఆ నాలుకతోనే వీళ్లు సెలబ్రిటీలు అయ్యారు.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఈ తండ్రీ కూతుళ్లకు ప్రపంచంలో అతి వెడల్పయిన నాలుక ఉంది. అందుకే వీరి పేర్లు గిన్నిస్ రికార్డులోకెక్కాయి.

బైరన్ ష్లీన్‌కర్ అనే ఈ పెద్దాయన 8.6 సెంటీమీటర్ల వెడల్పు నాలుకతో పురుషుల విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆయన 14 ఏళ్ల కూతురు ఎమిలీ కూడా 7.3 సెం.మీ వెడల్పు నాలుకతో మహిళల విభాగంలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది.
 

Advertisement
 
Advertisement
Advertisement