నటి కోసం కొట్టుకున్న హీరోలు! | Farhan, Aditya fight Over Shraddha Kapoor | Sakshi
Sakshi News home page

నటి కోసం కొట్టుకున్న హీరోలు!

Apr 5 2017 6:18 PM | Updated on Sep 5 2017 8:01 AM

నటి కోసం కొట్టుకున్న హీరోలు!

నటి కోసం కొట్టుకున్న హీరోలు!

తాజాగా వెలుగుచూసిన ఓ రూమర్‌ మాత్రం సినీ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది

ముంబై: బాలీవుడ్‌లో వివాదాలకు, వదంతులకు కొదువుండదు. కానీ, తాజాగా వెలుగుచూసిన ఓ రూమర్‌ మాత్రం బాలీవుడ్‌ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది. అదే బాలీవుడ్‌ నటులు  ఆదిత్య రాయ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అఖ్తర్‌ గొడవకు దిగడం.. అదికూడా నటి శ్రద్ధా కపూర్‌ కోసమేనట.

ఇటీవల మహేశ్‌ భట్‌ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో అందరూ స్టార్స్‌ లాగే 'ఆషికీ-2' స్టార్స్‌ ఆదిత్య, శ్రద్ధ జంటగా హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్‌ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్‌ లవర్స్‌ కలిసి వచ్చి పార్టీలో హల్‌చల్‌ చేయడం ఫర్హాన్‌ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్‌ ఆన్‌ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు.

ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్‌ కు కోపం తెప్పించిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్‌ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ గొడవ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి ఫర్హాన్‌ ఇంటి వద్ద శ్రద్ధ కనిపించింది. గొడవ నేపథ్యంలో ఫర్హాన్‌కు నచ్చజెప్పేందుకు, ఇద్దరి నటుల మధ్య రాజీ కుదిర్చేందుకే మంగళవారం రాత్రి ఫర్హాన్‌ ఇంటికి శ్రద్ధ వచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement