తమిళ హీరో విజయ్ నటించిన 'అన్న' సినిమా చూడలేకపోయానన్న ఆవేదనతో తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళ హీరో విజయ్ నటించిన 'అన్న' సినిమా చూడలేకపోయానన్న ఆవేదనతో తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన విష్ణు (20) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. అతడు కోయంబత్తూరు శివార్లలోని తుడియాలూరు ప్రాంతంలో నివసిస్తుంటాడు. 'అన్న' సినిమా శుక్రవారమే విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. దీంతో విష్ణు చాలా ఆవేదన చెందాడు.
ఎలాగైనా సినిమా చూడాలన్న ఉద్దేశంతో అతడు ఇక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలోని వేలాంతవాళం అనే ఊరు వెళ్లాడు. కానీ, అక్కడ అతడికి టికెట్ దొరకలేదు. దాంతో తీవ్రంగా నిరాశ చెంది, కోయంబత్తూరు తిరిగి వచ్చేశాడు. కానీ తిరిగొచ్చాక, తెల్లవారు జామున తన ఇంట్లోని సీలింగ్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిర్మాతలకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం నుంచి బెదిరింపులు రావడంతో 'అన్న' సినిమా విడుదల తమిళనాడులో నిలిచిపోయింది.