ఇఫ్తార్ విందులో బరాక్ ఒబామా! | Escalation of Israel, Palestine tension benefits no one: Barak Obama | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్ విందులో బరాక్ ఒబామా!

Jul 15 2014 12:11 PM | Updated on Sep 2 2017 10:20 AM

ఇఫ్తార్ విందులో బరాక్ ఒబామా!

ఇఫ్తార్ విందులో బరాక్ ఒబామా!

అమెరికాలోని వైట్ హౌజ్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వార్షిక ఇఫ్తార్ విందులో అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గోన్నారు.

వాషింగ్టన్: అమెరికాలోని వైట్ హౌజ్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వార్షిక ఇఫ్తార్ విందులో అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గోన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్నఒబామా.. ఇజ్రాయిల్, పాలస్టీనాల పరస్పరదాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య పరస్పరదాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతోందని ఒబామా అన్నారు. 
 
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు పాలస్తీనా, ఇజ్రాయిల్ ఏమాత్రం మేలు చేస్తాయనుకోవడం లేదని.. అంతేకాకుండా ఏ ఒక్కరికి లాభం చేకూర్చదని ఆయన అన్నారు. 2012లో ఇరుదేశాల మధ్య  జరిగిన కాల్పుల ఒప్పందానికి కట్టుబడేలా చర్యలు తీసుకోవాలని ఒబామా సూచించారు. పౌరులపై రాకెట్ దాడులు చేయడాన్ని ఏ దేశం కూడా హర్సించదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement