బెలూన్లు ఎగరేసి.. అరెస్టయ్యారు | Employees of Diamond export company booked in Mumbai | Sakshi
Sakshi News home page

బెలూన్లు ఎగరేసి.. అరెస్టయ్యారు

May 26 2015 3:20 PM | Updated on Aug 25 2018 6:21 PM

బెలూన్లు ఎగరేసి.. అరెస్టయ్యారు - Sakshi

బెలూన్లు ఎగరేసి.. అరెస్టయ్యారు

బెలూన్లు ఎగరేయడం నేరమని ఎవరైనా అనుకుంటారా? కానీ.. ముంబై పోలీసులు అలాగే అనుకున్నారు.

బెలూన్లు ఎగరేయడం నేరమని ఎవరైనా అనుకుంటారా? కానీ.. ముంబై పోలీసులు అలాగే అనుకున్నారు. విమానాశ్రయ పరిధిలో అనుమానాస్పద వస్తువులను ఎగరేసినందుకు ముంబై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వజ్రాల ఎగుమతి కంపెనీ ఒకటి ఎయిరిండియా గ్రౌండులో ఓ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించింది. అయితే ఆ కార్యక్రమ నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతి ఏమీ తీసుకోకుండా.. హాట్ ఎయిర్ బెలూన్లను ఎయిర్పోర్టు పరిసరాల్లో ఎగరేశారు. వాటిమీద తమ ప్రకటనను ముద్రించుకున్నారు.

దీంతో ఎయిర్పోర్టు పోలీసు స్టేషన్లో ఆ నిర్వాహకుల మీద కేసు నమోదైంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జెట్ ఎయిర్వేస్, ఇండిగో పైలట్లు ఈ బెలూన్లను గమనించారు. ఎయిర్పోర్టు ఉద్యోగి ఒకరు వీటిని ఫొటో కూడా తీశారు. ఈ బెలూన్ల కారణంగా కొద్దిసేపు ఎయిర్ ట్రాఫిక్కు అంతరాయం కూడా కలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement