మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష | Egypt ex-leader Mohammed Morsi sentenced to death | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

May 16 2015 3:45 PM | Updated on Jul 11 2019 6:15 PM

మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష - Sakshi

మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2011లో జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు తప్పించుకుని వెళ్లిన ఘటనలో ఆయనకీ శిక్ష పడింది. కాగా, ఆయన అధికారంలో ఉండగా నిరసనకారులను అరెస్టు చేయాలని, చిత్రహింసలు పెట్టాలని ఆదేశించినందుకు ఇప్పటికే ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2013 జూలై నెలలో మోర్సీ పాలనపై తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగడంతో.. సైనిక తిరుగుబాటుతో ఆయనను పదవి నుంచి దించేశారు.

అప్పటి నుంచి ఆయన స్థాపించిన ముస్లిం బ్రదర్హుడ్ ఉద్యమాన్ని నిషేధించి, ఆయన మద్దతుదారుల్లో వేలాదిమందిని అరెస్టు చేశారు. అయితే.. మోర్సీ మద్దతుదారులు మాత్రం ఇదంతా ఆయనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని, ఇప్పటికే చేసిన కుట్రను న్యాయబద్ధంగా చూపించుకోడానికి ఆయనకు మరణశిక్ష వేశారని అంటున్నారు. ఈజిప్టులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షుడు మోర్సీయే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement