ఇ-ఫ్రెష్ మార్కెట్ అనుసంధాన సేవలు | E-fresh india starts market interlinking | Sakshi
Sakshi News home page

ఇ-ఫ్రెష్ మార్కెట్ అనుసంధాన సేవలు

Oct 11 2013 2:14 AM | Updated on Sep 1 2017 11:31 PM

ఇ-ఫ్రెష్ మార్కెట్ అనుసంధాన సేవలు

ఇ-ఫ్రెష్ మార్కెట్ అనుసంధాన సేవలు

వ్యవసాయ సంబంధ వెబ్ పోర్టల్ ఇ-ఫ్రెష్‌ఇండియా.కామ్ తాజాగా మార్కెట్ అనుసంధాన సేవలను ప్రారంభించింది. భారత్‌తోపాటు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ సంబంధ వెబ్ పోర్టల్ ఇ-ఫ్రెష్‌ఇండియా.కామ్ తాజాగా మార్కెట్ అనుసంధాన సేవలను ప్రారంభించింది. భారత్‌తోపాటు అమెరికాలోని ఫుడ్ సేఫ్టీ ధృవీకరణ కలిగిన వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల సరఫరాదారుల కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఉత్పత్తుల వారీగా, ఫుడ్ సేఫ్టీ ధృవీకరణల ఆధారంగానూ సరఫరాదారుల వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ధృవీకరణలు పొందని ఉత్పత్తిదారుల వివరాలూ ఉంటాయి. 
 
 ఉత్పత్తిదారులు అంతర్జాతీయ స్థాయిలో ఉనికి పెంచుకోవడానికి, వ్యాపార అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఇది వేదికగా నిలుస్తుందని ఇ-ఫ్రెష్ పోర్టల్ ఎండీ శ్రీహరి కోటెల తెలిపారు. మధ్యవర్తుల జోక్యం ఉండకపోవడంతో ఇరువురికి కలిసి వస్తుందని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రైతు సంఘాల సమాఖ్య చైర్మన్ ఎం.గోపాలక ృష్ణ, నాబార్డు మాజీ ఎండీ పీవీఏ రామారావుతో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సమాచారం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వివరాలను తెలియజేసేందుకు రైతు అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తొలుత కరీంనగర్, జగిత్యాల, గుంటూరులో ఇవి రానున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement