నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ | Don't touch my feet, Narendra Modi tells MPs | Sakshi
Sakshi News home page

నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ

Jun 6 2014 2:50 PM | Updated on Aug 15 2018 2:20 PM

నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ - Sakshi

నాకు పాదాభివందనం చేయొద్దు: మోడీ

వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ నిరసించారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు.

న్యూఢిల్లీ: వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ నిరసించారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించారు.

తనకు పాదాభివందనం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement