‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’ | Don't Punish me for Demonetisatiosn: BJP Minister to his Voters | Sakshi
Sakshi News home page

‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’

Jan 22 2017 3:08 PM | Updated on Aug 14 2018 9:04 PM

‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’ - Sakshi

‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’

‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాకు సంబంధం లేదు. దీనికి నన్ను శిక్షించొద్ద’ని బీజేపీకి చెందిన పంజాబ్‌ మంత్రి అనిల్‌ జోషి పేర్కొన్నారు.

అమృత్‌ సర్‌: ‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాకు సంబంధం లేదు. దీనికి నన్ను శిక్షించొద్ద’ని బీజేపీకి చెందిన పంజాబ్‌ మంత్రి అనిల్‌ జోషి పేర్కొన్నారు. అమృత్‌ సర్‌ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన మరోసారి బరిలో నిలిచారు. ఎవరో తీసుకున్న నిర్ణయానికి తనను శిక్షించొద్దని ఓటర్లకు జోషి విజ్ఞప్తి చేస్తున్నారు.

‘నా పదవీ కాలం ముగిసింది. ఈ ఒక్క నెల మీరందరూ కష్టపడాలి. ఓటర్ల దగ్గరకు వెళ్లి నాకు ఓటు వేయాలని కోరండి. పాత నోట్ల రద్దు నిర్ణయంతో అంతా తల్లకిందులయిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. దీనిపై ఇప్పుడేమీ చేయలేమని సముదాయించండి. ఇందులో అనిల్ జోషి పాత్ర లేదని చెప్పండి. జోషి ఎప్పుడూ మీ తరపున పోరాడతాడని ప్రజలకు తెలపండి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు జాగ్తత్తగా వ్యవహరించాల’ని తన మద్దతుదారులకు సూచించారు.

డీమోనిటైజేషన్‌ ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని తనను తాను ‘వికాస పురుషుడు’గా ప్రకటించుకున్న జోషి పేర్కొన్నారు. అకాలీదల్ ప్రభుత్వంతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తున్న జోషి తన ప్రచారంలో ఎక్కడా సీఎం ప్రకాశ్‌ సింగ్ బాదల్ పేరు ప్రస్తావించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement