భారత్-పాక్ వివాదాల్లోకి సినీ కళాకారులను,ఆటగాళ్లను లాగొద్దని సీపీఐనేత సీతారం ఏచూరి అన్నారు.
న్యూఢిల్లీ: భారత్-పాక్ వివాదాల్లోకి సినీ కళాకారులను, ఆటగాళ్లను లాగొద్దని సీపీఐ నేత సీతారం ఏచూరి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారిని ఆయా రంగాల్లో రాణించనివ్వాలని ఆయన శనివారమక్కడ వ్యాఖ్యానించారు. కాగా, సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పరిస్ధితులు సద్దుమణిగే వరకూ పాక్ సినీ కళాకారులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
కళలు, ఆటలను సమస్యలకు అతీతంగా నడవనిచ్చే స్ధాయికి అందరూ చేరుకోవాలని ఏచూరి అన్నారు. పాక్ సినీ కళాకారుల నిషేధంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కళాకారుల్లో లేదా ఆటగాళ్లలో ఎవరైనా దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తారని భావిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.