ఒడిసాలో అడుగు పెట్టొద్దు.. మావోయిస్టులకు డీజీపీ హెచ్చరిక | 'Don't enter Odisha', DGP warns Maoists | Sakshi
Sakshi News home page

ఒడిసాలో అడుగు పెట్టొద్దు.. మావోయిస్టులకు డీజీపీ హెచ్చరిక

Sep 14 2013 7:36 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఒడిసా డీజీపీ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీచేశారు.

ఒడిసా డీజీపీ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీచేశారు. మల్కన్గిరి జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్ తర్వాతైనా.. మావోయిస్టులు ఒడిసాలో అడుగు పెట్టకూడదన్న విషయం తెలుసుకోవాలన్నారు. ''ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మావోయిస్టులకు ఇదే నా హెచ్చరిక. వాళ్లు ఒడిసాలో అడుగుపెడితే, ఈ 13 మందికి పట్టిన గతే వాళ్లకూ పడుతుంది'' అని డీజీపీ ప్రకాష్ మిశ్రా తీవ్రస్వరంతో హెచ్చరించారు.

ఎన్కౌంటర్ అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు మల్కన్గిరి వెళ్లే ముందు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులపై ఒడిసా పోలీసులు ఉక్కుపాదం మోపుతారని ఆయన తెలిపారు. ఆయనతో పాటు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) అభయ్, ఐజీపీ (ఆపరేషన్స్) ప్రియదర్శి, సీనియర్ పోలీసు అధికారులు, మావోయిస్టుల అణచివేత ఆపరేషన్లలో నిమగ్నమైన ఇతర అధికారులు మల్కన్గిరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement