రక్తం ఇవ్వండి.. టిక్కెట్లు పట్టుకెళ్లండి | Donate blood, get free tickets for music fest | Sakshi
Sakshi News home page

రక్తం ఇవ్వండి.. టిక్కెట్లు పట్టుకెళ్లండి

Jul 21 2015 6:30 PM | Updated on Apr 3 2019 4:24 PM

రక్తం ఇవ్వండి.. టిక్కెట్లు పట్టుకెళ్లండి - Sakshi

రక్తం ఇవ్వండి.. టిక్కెట్లు పట్టుకెళ్లండి

'రక్తం ఇవ్వండి, టిక్కెట్లు తీసుకెళ్లండి' అంటున్నారు రుమేనియా మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకులు.

ట్రాన్సిల్వేనియా: 'రక్తం ఇవ్వండి, టిక్కెట్లు తీసుకెళ్లండి' అంటున్నారు రుమేనియా మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకులు. ఈనెలారుఖలో జరగనున్న సంగీతోత్సవానికి హాజరుకావాలనుకునే వారు రక్తదానం చేస్తే ఉచితంగా టిక్కెట్లు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు 'పే విత్ బ్లడ్' ప్రచారం చేపట్టినట్టు తెలిపారు.

తమ దేశంలో రక్తం కొరత చాలా తీవ్రంగా ఉందని, కేవలం 1.7 శాతం మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారని మ్యూజిక్ ఫెస్టివల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఆండ్రియన్ చెరెజీ తెలిపారు. రక్తదానం చేసే వారి సంఖ్య పెంచేందుకు ఈ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ప్యూజన్ ఇన్ స్టిట్యూట్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా పోస్టర్ రూపొందించి విడుదల చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement