కేంద్ర సచివాలయంలో అగ్నిప్రమాదం | Delhi: Fire broke out in North Block | Sakshi
Sakshi News home page

కేంద్ర సచివాలయంలో అగ్నిప్రమాదం

May 3 2017 4:07 PM | Updated on Sep 5 2018 9:47 PM

కేంద్ర సచివాలయంలో అగ్నిప్రమాదం - Sakshi

కేంద్ర సచివాలయంలో అగ్నిప్రమాదం

కేంద్ర సచివాలయంలోని నార్త్ బ్లాక్ లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది..

న్యూఢిల్లీ: కేంద్ర సచివాలయ భవనంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ కేబుళ్లు కాలిపోవడంతో నార్త్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఫైళ్లు, తదితర సామాగ్రికి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. మూడేళ్ల కిందట ఇదే నార్త్ బ్లాక్ లోని హోం మంత్రి కార్యాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement