డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు | dehradun professor creates world record in teaching | Sakshi
Sakshi News home page

డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు

Mar 7 2014 10:34 AM | Updated on Sep 2 2017 4:27 AM

డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు

డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువ ప్రొఫెసర్ 130 గంటలపాటు (5 రోజులకు పైగా) నిరాఘాటంగా పాఠాలు బోధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువ ప్రొఫెసర్ 130 గంటలపాటు (5 రోజులకు పైగా) నిరాఘాటంగా పాఠాలు బోధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. నిరాఘాటంగా పాఠాలు బోధించడంలో ఇప్పటి వరకు పోలాండ్ ఉపాధ్యాయుడి పేరుతో ఉన్న రికార్డును(121 గంటలు) అధిగమించారు. వివరాలు.. 26 ఏళ్ల అరవింద్ మిశ్రా స్థానిక గ్రాఫిక్ ఎరా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నిరాఘాట బోధనలో ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో మెకానికల్ ఇంజనీరింగ్ అంశాన్ని 130 గంటలపాటు నిరాఘాటంగా బోధించారు.

 

వర్సిటీలోని ఎంబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ప్యానల్ హాజరై యువ ప్రొఫెసర్ బోధన పట్ల అచ్చరువొందింది. కాగా, మిశ్రాను వర్సిటీ చైర్మన్ పొగడ్తలతో ముంచెత్తి రూ. లక్ష రివార్డు అందజేయడంతోపాటు పదోన్నతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement