ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్ | Creo Mark 1 Price Slashed in India for a Limited Period | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్

Aug 8 2016 6:39 PM | Updated on Sep 4 2017 8:25 AM

ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్

ఆ ఫోన్ ధరపై 6 వేలు కట్

క్రియో సంస్థ 'క్రియో మార్క్ 1' పేరుతో విడుదల చేసిన తన నూతన స్మార్ట్ ఫోన్పై ధరలు తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.

క్రియో సంస్థ 'క్రియో మార్క్ 1' పేరుతో విడుదల చేసిన తన నూతన స్మార్ట్ ఫోన్పై ధరలు తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్లో ఈ ఫోన్పై 6వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గించిన ధరతో రూ.19,999గా ఉన్న ఈ ఫోన్ ఇక నుంచి మార్కెట్లో రూ.13,999కే లభ్యంకానున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ లిమిటెడ్ ఆఫర్ ఆగస్టు 15తో ముగుస్తుందని పేర్కొంది. క్రియో మార్క్1 ఫోన్పై ధరలు తగ్గడం ఇదే మొదటిసారీ కాదు. గత నెలలో కూడా ఇదేమాదిరి పరిమిత కాలంలో ఈ ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.    
 

క్రియో మార్క్1 ఫీచర్లు..
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ(1440 x 2560 పిక్సల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే
 గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్
 డ్యుయల్ సిమ్(మైక్రోసిమ్, నానో సిమ్)
1.95 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్
 3 జీబీ ర్యామ్
 21 మెగాపిక్సల్ రియర్ ఆటోఫోకస్ కెమెరా
4కే వీడియో రికార్డింగ్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్
 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
4జీ ఎల్‌టీఈ
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement