
రామాలయ నిర్మాణమే లక్ష్యం: తొగాడియా
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు.
సాక్షి, బెంగళూరు: అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. ఇందు కోసం అవసరమైతే చట్టసభల్లోనూ పోరాటానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
హూబ్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 21 నుంచి మూడు రోజులపాటు దేశంలోని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు.