నితీశ్ కు మద్దతు కొనసాగుతుంది: కాంగ్రెస్ | Congress extended support to Nitish Kumar | Sakshi
Sakshi News home page

నితీశ్ కు మద్దతు కొనసాగుతుంది: కాంగ్రెస్

May 18 2014 12:32 PM | Updated on Jul 18 2019 2:11 PM

నితీశ్ కు మద్దతు కొనసాగుతుంది: కాంగ్రెస్ - Sakshi

నితీశ్ కు మద్దతు కొనసాగుతుంది: కాంగ్రెస్

బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది.

న్యూఢిల్లీ: బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బీహార్లో  జేడీ(యూ) ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. ఈ విషయంలో వెనక్కు తగ్గబోమని చెప్పారు.

కాగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామని జేడీ(యూ) నేత విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. నితీశ్ను కొనసాగించాలా, వద్దా అనే దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.  మరోవైపు రాజీనామాకు వ్యతిరేకంగా జేడీ(యూ) కార్యకర్తలు నితీశ్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. రాజీనామా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement