కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్ర ప్రారంభమైంది.
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లేకుండానే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్ర ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం తదితరులు దీనికి హాజరయ్యారు.
రాష్ట్ర విభజన విషయమై ఆంటోనీ కమిటీ ఇప్పటికే ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలతో సమావేశం కావడం, ఆ వివరాలను కోర్ కమిటీ చర్చించాల్సి రావడం, మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించే అవకాశం ఉండటంతో కోర్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.