కేజ్రీవాల్ బాటలో కేరళ సీఎం | Confident Oommen Chandy blames media | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ బాటలో కేరళ సీఎం

Mar 17 2014 10:12 AM | Updated on Oct 22 2018 8:40 PM

కేజ్రీవాల్ బాటలో కేరళ సీఎం - Sakshi

కేజ్రీవాల్ బాటలో కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ... ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దారిలో నడుస్తున్నారు.

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ... ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దారిలో నడుస్తున్నారు. రాజకీయాలు, పాలన విషయంలో అనుకుంటే పొరబడినట్టు. మీడియాను దుమ్మెత్తిపోయడంలో కేజ్రీవాల్ను అనుసరిస్తున్నారు కేరళ సీఎం. సంచలనాల కోసం మీడియా పాకులాడుతోందని ఆయన విమర్శించారు.

తన పట్ల మీడియా పారదర్శకంగా వ్యవహరించడం లేదని వాపోయారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వ్యతిరేక ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే మీడియా రాజకీయాలు చేయడం లేదని కేవలం సంచలనాల కోసమే పాకులాడుతోందని అన్నారు. ప్రజలను చేరుకోవడానికి తనకు అనేక మార్గాలున్నాయని చెప్పారు. తన దృష్టంతా అభివృద్ధిపైనే అని ఊమెన్ చాందీ స్పష్టం చేశారు.

సోలార్ స్కామ్లో తనకు తాను క్లీన్ చీట్ ఇచ్చుకునే యత్నం చేశారాయన. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెట్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో సత్తా చాటుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement