103 నగరాల్లో నీట్‌ నిర్వహిస్తాం | conduct the NEET exam 2017 in 103 cities | Sakshi
Sakshi News home page

103 నగరాల్లో నీట్‌ నిర్వహిస్తాం

Mar 24 2017 5:33 PM | Updated on Oct 20 2018 5:44 PM

103 నగరాల్లో నీట్‌ నిర్వహిస్తాం - Sakshi

103 నగరాల్లో నీట్‌ నిర్వహిస్తాం

విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు నీట్‌ను దేశవ్యాప్తంగా 103 నగరాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

న్యూఢిల్లీ:  విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు నేషనల్‌ ఎంట్రన్స్‌ కం ఎలిజిబిలిటీ టెస్ట్‌(నీట్‌)ను దేశవ్యాప్తంగా 103 నగరాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు తేలిగ్గా తమ సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు మోబైల్‌ యాప్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ తెలిపారు. ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా రాసే వీలుకల్పిస్తున్నట్లు వైద్య శాఖ కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ను నిర్వహిస్తారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement