breaking news
central minister prakash javadekar
-
103 నగరాల్లో నీట్ నిర్వహిస్తాం
న్యూఢిల్లీ: విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేందుకు నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)ను దేశవ్యాప్తంగా 103 నగరాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు తేలిగ్గా తమ సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు మోబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు. ఈ పరీక్షను ప్రాంతీయ భాషల్లో కూడా రాసే వీలుకల్పిస్తున్నట్లు వైద్య శాఖ కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ను నిర్వహిస్తారు. -
లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే
జవదేకర్ జోస్యం సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి లోకాయుక్తా వస్తే, అమ్మ మళ్లీ జైలు కెళ్లినట్టే. అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నినాదం ఆమె నోటి మాటే, అని చమత్కరిస్తున్నారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ నినాదాల్ని అందుకుని ఉన్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు విడుదల చేసుకున్న మేనిఫెస్టోల్లో ‘లోకాయుక్తా’ నినాదం తప్పని సరిగా ఉన్నాయి. అవినీతిని రూపు మాపాలంటే లోకాయుక్తాతోనే సాధ్యం అన్నట్టుగా ప్రచారాల్లో గళం విప్పే పనిలో పడ్డాయి. ఇంతవరకు బాగానే, ఉన్నా లోకాయుక్తా వస్తే మాత్రం జైలుకు వెళ్లేది జయలలితే అని గంటాపథంగా జవదేకర్ వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. చెన్నైలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన జవదేకర్ జయలలితను ఉద్దేశించి సెటెర్లు విసిరారు. గతంలో ఇంటికి 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ అని ప్రకటించి లీటరు రూ. పదికి అమ్ముకున్న వాళ్లు, విద్యుత్ మిగులు అని ఎన్నికల ఫీట్లు చేస్తున్న వాళ్లు, ఇప్పుడేమో లోకాయుక్తా అన్న నినాదం అందుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. లోకాయుక్త అమ్మ పెదవి నోటి మాటకే పరిమితం. అది అమలయ్యేది డౌటే. ఎందుకంటే, అది వస్తే జైలుకు వెళ్లేది జయలలితే అని చమత్కరించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తు ల కేసు సుప్రీంలో వి చారణలో ఉన్నం దు, రాష్ట్రంలో లోకాయుక్తా అవసర మా..? అని పెదవి విప్పే అన్నాడీఎంకే వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో లోకాయుక్త వస్తే, అమ్మ ఒక్కట్టేనా...?తాతయ్య అండ్ ఫ్యామిలీ వెళ్లదా..? అని జవదేకర్‌కు ప్రశ్నల్ని సంధించే వాళ్లు ఉండడం ఆలోచించాల్సిందే. అవినీతిలో డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందే అని వ్యాఖ్యానించే కమలం పెద్ద, ఒక్క అమ్మకే జైలు అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే.