సీఎం హెలికాప్టర్‌ ఎమర్జన్సీ ల్యాండింగ్‌ | Chopper carrying Karnataka CM makes emergency landing | Sakshi
Sakshi News home page

సీఎం హెలికాప్టర్‌ ఎమర్జన్సీ ల్యాండింగ్‌

Apr 24 2017 2:55 PM | Updated on Sep 5 2017 9:35 AM

సీఎం హెలికాప్టర్‌ ఎమర్జన్సీ ల్యాండింగ్‌

సీఎం హెలికాప్టర్‌ ఎమర్జన్సీ ల్యాండింగ్‌

సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రమాదం తప్పింది. సోమవారం సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

కర్ణాటక సీఎం.. హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురితో కలసి శ్రావణబెళగలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. కాగా హెలికాప్టర్‌ బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనడంతో పైలట్‌ వెంటనే బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. హెలికాప్టర్‌ సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢీకొనడం వల్ల హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్ది నిమిషాల తర్వాత సీఎం బృందం అదే హెలికాప్టర్‌లో శ్రావణబెళగలకు బయల్దేరి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement