చికాగో విమానం దారి మళ్లింపు | Chicago flight to China diverted due to unruly passenger | Sakshi
Sakshi News home page

చికాగో విమానం దారి మళ్లింపు

Nov 28 2016 9:41 AM | Updated on Sep 4 2017 9:21 PM

చికాగో నుంచి చైనా బయల్దేరిన విమానాన్ని దారి మళ్లించారు.

టోక్యో: అమెరికాలోని చికాగో నుంచి చైనా బయల్దేరిన యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన కారణంగా దారి మళ్లించారు. జపాన్‌ రాజధాని టోక్యో సమీపంలోని  నరిటా విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. విమానంలో 241 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి చెప్పారు.

చికాగోకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం చైనాలోని ఓ హరె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సివుంది. అయితే విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల దారి మళ్లించాల్సి వచ్చింది. 12 గంటల తర్వాత విమానం జపాన్‌ నుంచి చైనాకు బయల్దేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement