మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం | chandrababu niadu angry on ministers, officers over employees transfers issue | Sakshi
Sakshi News home page

మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం

Jun 21 2016 3:09 PM | Updated on Sep 4 2017 3:02 AM

మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం

మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మంత్రులకు, అధికారులను క్లాస్ పీకారు. ఉద్యోగుల బదిలీలను ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.  అధికారులను సమన్వయం చేసుకోనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇంచార్జీ మంత్రిగా పెట్టి ఉపయోగం ఏముందని ఆయన ప్రశ్నించారు.

గుంటూరు-విజయవాడ మధ్య గంట దూరం లేకపోయినా వచ్చి కూర్చుని మాట్లాడటానికి మీకు తీరిక ఉండటం లేదా... చెప్పింది అర్థం చేసుకోకుండా...సిన్సియారిటీ లేకుండా పని చేస్తే ఎలా అని ధ్వజమెత్తారు. మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీల మధ్య కూడా సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎందుకింత ఇగోలతో ఉన్నారో అర్ధం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement