విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు, బస్సు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
	సాక్షి, హైదరాబాద్, విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్లు, బస్సు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పట్టాల మీదుగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను దక్షిణ మధ్య ైరె ల్వే రద్దు చేసింది.  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద వరద ఉద్ధృతి అతి ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. శ్రీకాకుళం జిల్లా జాదూపూడి-ఇచ్చాపురం మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం వర్షపు నీరు 2 మీటర్లకు పైగా రావడంతో హౌరా వైపు నుంచి రావల్సిన పలు రైళ్లను నాగపూర్, బలార్ష, వరంగల్ మీదుగా విజయవాడకు నడిపారు.   
	 
	 రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు: భువనేశ్వర్-విశాఖపట్టణం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను గురువారం రద్దయ్యాయి. హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంతపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-జగదల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లను అంగుల్, విశాఖపట్నంల మీదుగా మళ్లించారు. త్రివేండ్రం-గువాహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-న్యూ జల్పాయ్‌గురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం, టిట్లాఘర్ జంక్షన్‌ల మీదుగా మళ్లించారు.
	 
	  సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కొచువేలి-గువాహతి ప్రత్యేక రైలు, యశ్వంత్‌పూర్-షాలిమార్ ప్రత్యేక రైలు, పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్, హైరా-చెన్నై, షాలీమార్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్, భాగల్‌పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, గువాహతి-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను ఖరగ్‌పూర్, టాటానగర్, బల్లార్షా, వరంగల్ మీదుగా మళ్లించారు. షాలీమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా ఎక్స్‌ప్రెస్‌లను వరంగల్ మీదుగా మళ్లించారు.
	 
	 వర్షపాత వివరాలు
	 (సెంటీ మీటర్లలో)
	 కళింగపట్నం    :    32
	 ఒంగోలు    :    31
	 అచ్చంపేట    :    22
	 కాకినాడ, టెక్కలి    :    20
	 దర్శి    :    18
	 పత్తిపాడు    :    15
	 అద్దంకి, మందస    :    14
	 పిడుగురాళ్ల, పలాస,
	 దేవరకొండ    :    13
	 బాపట్ల, భీమిలి,
	 ఇచ్చాపురం, మాచర్ల    :    12
	 సోంపేట, విజయనగరం,
	 అవనిగడ్డ    :    11
	 విశాఖపట్నం, పాతపట్నం,
	 సీతారాంపురం,కల్వకుర్తి,
	 చేవెళ్ల    :    10
	 అనకాపల్లి    :    9
	 రణస్థలం, పాలకొండ,
	 సత్తెనపల్లి, గజపతినగరం,
	 ఆత్మకూరు(కర్నూలు జిల్లా),
	 నాగర్‌కర్నూలు,
	 సుల్తానాబాద్    :    8
	 తెర్లాం, చీపురుపల్లి, గుంటూరు,
	 కోడేరు, మచిలీపట్నం, గుత్తి,
	 కొల్లాపూర్, మెదక్    :    7
	 ఎస్‌కోట, తెనాలి, గుడివాడ,
	 భీమవరం, ఎర్రగొండపాలెం,
	 లక్కిరెడ్డిపాలెం,రామన్నపేట,
	 సూర్యాపేట, ఇబ్రహీంపట్నం,
	 పరకాల    :    6
	 
	 5 సెం.మీ. లోపు వర్షపాతం
	 మంగళగిరి, రెంటచింతల, నర్సాపురం, కందుకూరు, విజయవాడ, కుంబం, వీరఘట్టం, ఉదయగిరి, అచ్చంపేట, పొదిలి, రేపల్లె, బొబ్బిలి, చోడవరం, పత్తికొండ, కదిరి, పోరుమామిళ్ళ, ఏటూరునాగారం, పార్వతీపురం, వింజమూరు, నర్సీపట్నం, సిరిసిల్ల, తుని, రాజమండ్రి, యలమంచిలి, అరకు, కొమరాడ, నూజివీడు, ఔకు, మడకశిర, బద్వేలు, ఎమ్మిగనూరు, తాండూరు, దుబ్బాక, బాన్సువాడ, రామగుండం, వెంకటాపురం, మహబూబ్‌నగర్.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
