తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కర్నూలు: తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సోమవారం కర్నూలులో వ్యవసాయ, సాగునీటి అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు.
దిగువ కాల్వ కింద కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులకు అధికారులు తెలిపారు. వరిపంటకు నీరు విడదల చేసేందుకు ప్రాజెక్టులో నీరు లేదని వారు పేర్కొన్నారు.