క్యాబ్ డ్రైవర్లకు బంపర్ ఆఫర్ | Cab war: Drivers pampered with flats offered by Sivasankaran's UTOO taking on Ola, Uber | Sakshi
Sakshi News home page

క్యాబ్ డ్రైవర్లకు బంపర్ ఆఫర్

Aug 2 2016 7:18 PM | Updated on Oct 4 2018 4:27 PM

క్యాబ్ డ్రైవర్లకు బంపర్ ఆఫర్ - Sakshi

క్యాబ్ డ్రైవర్లకు బంపర్ ఆఫర్

క్యాబ్ అగ్రిగేటర్ యూ టూ ఓ సరికొత్త ఆఫర్ తో డ్రైవర్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎయిర్ సెల్ ఫౌండర్, యూటూ అధిపతి సి. శివ శంకరన్ తమ క్యాబ్ డ్రైవర్ల కోసం ఏకంగా 200 ఫ్లాట్లను కొనుగోలు చేశారు.

చెన్నై: ఉద్యోగులను ఆకట్టుకోవడానికి అనేక కార్పొరేట్ సంస్థలు, సంస్థ లాభాలను పంచి  యివ్వడం,  ఇంన్సెంటివ్స్ , బోనస్ లు ఇలా  వివిధ రకాలు ఆఫర్లు ప్రకటించడం తెలిసిందే. అయితే  క్యాబ్ అగ్రిగేటర్ యూ టూ ఓ సరికొత్త ఆఫర్ తో  డ్రైవర్లను ఆకర్షిస్తోంది.  ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎయిర్ సెల్  ఫౌండర్,  యూటూ అధిపతి  సి. శివ శంకరన్   తమ  క్యాబ్  డ్రైవర్ల కోసం ఏకంగా 200  ఫ్లాట్లను కొనుగోలు చేశారు.   తమ డ్రైవర్లు  ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.దీనికి చెన్నైలోని పెరం బూర్ లో అరిహంట్ బిల్డర్స్ నుంచి  మొదటి విడతగా  200  ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్టు చెప్పారు. అలాగే ఓల్డ్ మహాబలిపురం రోడ్, అంబత్తూర్  తదితర ఏరియాల్లో అమ్ముడు పోని రియల్ ఎస్టేట్ జాబితానుంచి 15, 20 లక్షల రేంజ్ లో మరిన్ని హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేస్తామన్నారు.   దీనికోసం కేంద్ర ప్రభుత్వ  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన  సబ్సిడీ పథకాన్ని ఉపయోగించుకోనున్నామన్నారు.
 
 కాగా ఓలా, ఉబెర్ లకు పోటీగా  చెన్నైలో   గత నెలలో లాంచ్ అయింది. ప్రస్తుతానికి సాఫ్ట్ లాంచ్ దశలో ఉంది.  ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో బోయె నెట్ పై   ప్రముఖ లోగో తో  సహా, డ్రైవర్లకు యూనిఫారాలు కూడా ప్రవేశపెట్టింది.  శిక్షణ పొందిన తమ డ్రైవర్లు   యూనిఫాంలో  సౌమ్య ప్రవర్తనతో ఉంటారని  లాంచింగ్ సందర్భంగా యు టూ సీఈవో  కేవీపీ  భాస్కరన్   వెల్లడించారు. ప్రస్తుతం 180 వాహనాలు ఉన్నాయని, రాబోయే నెలలో  వెయ్యికి, మరో నాలుగునెలల్లో 8,500 కార్లకు విస్తరిస్తామని  జూన్ 9  లాంచ్ సందర్భంగా శివ శంకరన్ ప్రకటించారు. అయితే ఈ కంపెనీలో   మార్జినల్ వాటాను   మరో పారిశ్రామిక వేత్త బిలియనీర్ అజయ్ పిరామల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement