జమ్మూకాశ్మీర్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) కాన్వాయ్పై దాడి జరిగింది.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఉదంపూర్కు పది కిలో మీటర్ల దూరంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై బీఎస్ఎఫ్ సిబ్బంది వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.