వరుని మెడలో తాళి కట్టిన వధువు | Bride nod to rope bridegroom | Sakshi
Sakshi News home page

వరుని మెడలో తాళి కట్టిన వధువు

Feb 11 2014 12:46 AM | Updated on Sep 2 2017 3:33 AM

వరుని మెడలో తాళి కట్టిన వధువు

వరుని మెడలో తాళి కట్టిన వధువు

ఇన్నాళ్లూ పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు తాళికట్టడం మనకు తెలుసు. అయితే, ఈ సంప్రదాయానికి భిన్నంగా తమిళనాడులోని తిరువాయూరు జిల్లాలో పెళ్లి కుమార్తే..

ప్యారిస్(చెన్నై), న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు తాళికట్టడం మనకు తెలుసు. అయితే, ఈ సంప్రదాయానికి భిన్నంగా తమిళనాడులోని తిరువాయూరు జిల్లాలో పెళ్లి కుమార్తే.. పెళ్లి కుమారుని మెడలో మూడు ముళ్లువేసి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కమ్యూనిస్టు భావాలు గల సోము కుమార్తె వాసంతికి శ్రీరంగానికి చెందిన సతీష్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. దీంతో ఇరువురికీ ఆదివారం మారియమ్మన్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. వరుడు సతీష్, వధువు వాసంతి మెడలో తాళి కట్టాడు. అనంతరం మండపంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో స్త్రీ, పురుషులు సమానమేనన్న అంశాన్ని గట్టిగా నమ్మే వాసంతి, వరుడు సతీష్ మెడలో తాళి కట్టింది. దీన్ని చూసి వివాహ వేడుకకు వచ్చిన వారందరూ ముక్కుమీద వేలేసుకున్నా తర్వాత తేరుకుని వాసంతి నిర్ణయాన్ని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement