భోపాల్: ఒక్కసారిగా విరుచుకుపడిన భయంకరమైన వరద.. కళ్లముందే బైక్‌తో సహా కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి.. ‘కాపాడండి.. కాపాడండి’ అని ప్రాణభయంతో కేకలు వేస్తూ అర్థిస్తున్నాడు. అప్పుడే దేవుడిలా ముందుకొచ్చింది ఓ నవవధువు! క్షణం ఆలస్యం చేయకుండా తన మెడలోని చున్నీనే తాడులా విసిరింది! ఆ అభాగ్యుడు దాన్ని పట్టుకోగానే.. తన బంధువు, మరో స్థానికుడి సాయంతో శక్తులన్నీ ఒడ్డి అతడిని ఒడ్డుకు లాగి, మృత్యువు నుంచి కాపాడింది.
ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఆ వ్యక్తి సోమవారం సాయంత్రం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉప్పొంగిన వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోవడం ప్రారంభించాడు. అదే సమయంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నవవధువు, ఆమె బంధువైన మరో మహిళ ఈ భయానక దృశ్యాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ నవవధువు తన మెడలోని చున్నీని తొలగించి, నీటి ప్రవాహంలో పోరాడుతున్న బైకర్ వైపు తాడులా విసిరింది.
ఆ వ్యక్తి చాకచక్యంగా చున్నీని పట్టుకోగా, నవవధువు,ఆమెతో ఉన్న మహిళ దాన్ని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాగడం ప్రారంభించారు. వారి ధైర్యసాహసాలను చూసిన మరో స్థానికుడు కూడా వెంటనే పరుగెత్తుకొచ్చి వారితో చేయి కలిపాడు. ముగ్గురూ కలిసి శక్తులన్నీ ఒడ్డి ఆ బైకర్‌ను ప్రాణాపాయం నుంచి సురక్షితంగా రక్షించారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు చంబా జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిలోనూ సొంత ప్రాణాలను పణంగా పెట్టి బైకర్‌ను కాపాడిన ఆ నవవధువు, ఆమె బంధువుల సాహసాన్ని స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు విశేషంగా కొనియాడుతున్నారు.
A biker caught in a sudden flash flood in Himachal Pradesh's Chamba was pulled to safety by a family who risked the strong current to help him. The incident took place on the Kakiara-Tunuhatti road in the Bharmala area of Bhatiyat after heavy rain late in the evening caused water… pic.twitter.com/pdvEimLaER
— NDTV (@ndtv) September 1, 2026


