లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్.. | breathalyzer to recognise lung cancer | Sakshi
Sakshi News home page

లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్..

Jun 20 2014 12:26 AM | Updated on Sep 2 2017 9:04 AM

లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్..

లంగ్ కేన్సర్‌ను గుర్తించే నా‘నోస్’ చిప్..

ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కేన్సర్‌ను ఇకపై ఓ బ్రీథలైజర్(శ్వాస విశ్లేషణ పరికరం) ద్వారా కూడా గుర్తించొచ్చు.

ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కేన్సర్‌ను ఇకపై ఓ బ్రీథలైజర్(శ్వాస విశ్లేషణ పరికరం) ద్వారా కూడా గుర్తించొచ్చు. శ్వాస విశ్లేషణ ద్వారా లంగ్ కేన్సర్‌ను గుర్తించే నానోస్ అనే నానోటెక్ చిప్‌ను టెల్ అవైవ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు. ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడిన, ఆ వ్యాధి ముప్పు తీవ్రంగా ఉన్న 358 మంది రోగులపై, సాధారణ ఆరోగ్యవంతులపై ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 90 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. మామూలుగా అయితే ఊపిరితిత్తుల కేన్సర్ నిర్ధారణకు కఠినమైన బ్రాంకోస్కోపీలు, కంప్యూటర్ ఆధారిత బయాప్సీలు లేదా శస్త్రచికిత్సల వంటివి అవసరం అవుతాయట. కానీ ఈ నానోస్ చిప్ బ్రీథలైజర్  శ్వాస పరీక్ష ద్వారానే కేన్సర్‌ను గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 

ఊపిరితిత్తుల కేన్సర్ కణతులు విడుదల చేసే రసాయనాలు గాలిలో సులభంగానే ఆవిరిగా మారుతాయి. వాటిని పసిగట్టడం ద్వారా ఈ పరికరం కేన్సర్‌ను గుర్తుపడుతుంది. అలాగే కే న్సర్ కణతుల రకం, తీవ్రతను కూడా దీనితో గుర్తించవచ్చట.  వీరి అధ్యయన ఫలితాలను షికాగోలో ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ సదస్సులో సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement