
ఢిల్లీలో బోనం ఎత్తుకున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ. చిత్రంలో కేశవరావు
లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి (హైదరాబాద్) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సాక్షి, న్యూఢిల్లీ: లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి (హైదరాబాద్) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వైష్ణవీ మాత దేవాలయం నుంచి మహంకాళి మాత విగ్రహాన్ని శోభా యాత్రగా తీసుకువచ్చి తెలంగాణ భవన్‌లో ప్రతిష్టించి పూజలు చేశారు.
డప్పు దరువులు, పోతరాజు నృత్యాల మధ్య బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎంపీలు బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత బోనాలు ఎత్తుకున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, హనుమంతరావు, వినోద్‌కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మాణిక్ ప్రభు గౌడ్, కార్యవర్గ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.