'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం' | Bombing Afghan hospital was a mistake says US military | Sakshi
Sakshi News home page

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'

Oct 7 2015 9:02 AM | Updated on Aug 24 2018 4:57 PM

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం' - Sakshi

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'

ఆఫ్ఘానిస్థాన్లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.

వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆఫ్ఘాన్లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్బెల్ వివరణ ఇచ్చారు.

శనివారం కుండజ్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘాన్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.  కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్బెల్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుండజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్లో భాగంగా ఆఫ్ఘాన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్బెల్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement