అమెరికాలో బాంబు కలకలం! | Bomb scare reported at Washington DC area theme park | Sakshi
Sakshi News home page

అమెరికాలో బాంబు కలకలం!

Jul 13 2016 10:56 PM | Updated on Sep 4 2017 4:47 AM

అమెరికా వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ థీమ్ పార్క్ ‘సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా’ వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది.

అమెరికా వాషింగ్టన్ డీసీలోని ప్రముఖ థీమ్ పార్క్ ‘సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా’ వద్ద బుధవారం బాంబు కలకలం రేగింది. ఈ థీమ్ పార్కు వద్ద బాంబులు ఉన్నట్టు అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు ‍వదంతులపై ప్రస్తుతం పోలీసు అధికారులకు సహకరిస్తున్నామని, థీమ్‌ పార్కు పూర్తిగా సురక్షితంగా ఉన్నదని నిర్ధారించుకునేవరకు దీనిని మూసివేస్తున్నామని పార్కు అధికారులు ట్విట్టర్ లో తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు థీమ్ పార్కు వద్ద రెండు అనుమానిత ప్యాకేజీలు లభించాయని, దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రిన్స్ జార్జ్ కౌంటీ అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి మార్క్ బ్రాడీ తెలిపారు. మొదటి అనుమానిత ప్యాకేజీని తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఏమీ కనిపించలేదని, రెండో దానిని ప్రస్తుతం అధికారులు తనిఖీలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement