
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘ఏక్ థా టైగర్’. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్‌నేషనల్ స్పై మ్యూజియంలో ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘ఏక్ థా టైగర్’ కావడం విశేషం. ఈ విషయంపై ‘ఏక్ థా టైగర్’ దర్శకుడు కబీర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఓ సినిమా సక్సెస్‌ను బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే నిర్ణయించలేవు.

ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతకాలం గుర్తుంటుందన్నది కూడా ముఖ్యమే’’ అని పేర్కొన్నారు. ఇక వాషింగ్టన్ డీసీలోని ఇంటర్‌నేషనల్ స్పై మ్యూజియంలో ‘జేమ్స్‌బాండ్, మిషన్ ఇంపాజిబుల్’ తదితర స్పై చిత్రాల పోస్టర్స్‌ను ప్రదర్శించారు. ఈ హాలీవుడ్ చిత్రాల చెంత హిందీ మూవీ చేరడం ఓ విశేషం. రూ. 75 కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా నిర్మించిన ‘ఏక్ థా టైగర్’ (2012) దాదాపు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్స్‌గా వచ్చిన ‘టైగర్ జిందా హై, టైగర్ 3’ చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూట్‌తో హీరోగా బిజీగా ఉన్నారు సల్మాన్.