విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడు: హీరోయిన్‌ | Bollywood actress accuses husband of harassment | Sakshi
Sakshi News home page

విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడు: హీరోయిన్‌

Aug 22 2016 7:02 PM | Updated on Sep 4 2017 10:24 AM

విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడు: హీరోయిన్‌

విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడు: హీరోయిన్‌

విడాకుల కోసం భర్త తనను వేధిస్తున్నాడని బాలీవుడ్‌ నటి ఆలిసా ఖాన్‌ పోలీసులను ఆశ్రయించింది.

విడాకుల కోసం భర్త తనను వేధిస్తున్నాడని బాలీవుడ్‌ నటి ఆలిసా ఖాన్‌ పోలీసులను ఆశ్రయించింది. మోడల్‌ నుంచి నటిగా మారిన ఆలిసా ఖాన్‌ ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ హష్మీ సరసన 'ఐనా' సినిమాలో నటించింది. ఆమె ఇటీవలే సినీ నిర్మాత లవ్‌ కపూర్‌ను పెళ్లాడింది.

అయితే, లవ్‌ కపూర్‌ తనను వేధిస్తున్నాడని, ఓసారి తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపిస్తూ ఆమె ఘజియాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హరిద్వార్ వాసి అయిన లవ్‌ కపూర్‌ను పెళ్లాడేందుకు ఆమె మతం కూడా మార్చుకుంది. ఘజియాబాద్‌ లోని ఓ అద్దె నివాసంలో ఈ జంట నివసిస్తోంది. గత శుక్రవారం ఓ హోటల్‌లో మద్యం మత్తులో భర్త తనపై దాడి చేశాడని, ఆ తర్వాత తనను హోటల్‌లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది. విడాకులు ఇవ్వాలని భర్త తనను వేధిస్తున్నాడని, అందుకు తాను ఒప్పుకోకుండా తమ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపింది. ఆలిసా ఖాన్‌ ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement