‘వైట్‌హౌస్ రేస్’పై ఆలోచిస్తున్నా: బాబీ జిందాల్ | Bobby Jindal still mulling 2016 White House run | Sakshi
Sakshi News home page

‘వైట్‌హౌస్ రేస్’పై ఆలోచిస్తున్నా: బాబీ జిందాల్

Jul 17 2014 3:26 PM | Updated on Sep 2 2017 10:26 AM

‘వైట్‌హౌస్ రేస్’పై ఆలోచిస్తున్నా: బాబీ జిందాల్

‘వైట్‌హౌస్ రేస్’పై ఆలోచిస్తున్నా: బాబీ జిందాల్

2016లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని లూసియానా రాష్ట్ర గవర్నర్, భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ తెలిపారు.

వాషింగ్టన్: 2016లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని లూసియానా రాష్ట్ర గవర్నర్, భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ తెలిపారు. దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నానన్నారు. ‘వైట్‌హౌస్ రేస్’లో పాల్గొనడంపై ఈ నవంబర్ తరవాతే ఏ నిర్ణయమైనా ఉంటుందన్నారు. 2012 అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం అనంతరం తెలివితక్కువగా వ్యవహరించడం ఆపేయాలంటూ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి సూచించి జిందాల్ సంచలనం సృష్టించడం తెలిసిందే.
 

జిందాల్ లూసియానా గవర్నర్గా ఇప్పటికి రెండోసారి పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం 2015తో ముగుస్తుంది. ఎటూ మూడోసారి ఆ రాష్ట్రానికి గవర్నర్గా పోటీ చేయలేరు. వెటెర్ ఈసారి గవర్నర్ పదవికి పోటీ పడతారని భావిస్తున్నారు. అశేష ప్రజాదరణ ఉన్న బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థి అని పలువురు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement