చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు | BJP's aggressive campaign against dynasties gets mixed response | Sakshi
Sakshi News home page

చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు

Oct 19 2014 8:42 PM | Updated on Sep 2 2017 3:06 PM

చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు

చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా, కోడలు నైనా చౌతాలా గెలుపొందారు. ఓంప్రకాష్ మనవడు దుష్యంత్ చౌతాలా ఓటమి చవిచూశారు. మరో మాజీ సీఎం భజన్లాల్ బిష్ణోయి కుమారుడు కులదీప్, కోడలు రేణుక విజయం సాధించారు.

మరో మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు, బీసీసీఐ మాజీ చీఫ్ రణబీర్ సింగ్, బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి గెలుపొందారు. మాజీ డిప్యూటీ సీఎం చందర్ మోహన్ ఓడిపోయారు. హర్యానా లోక్హిత పార్టీ అధ్యక్షుడు గోపాల్ కందా, ఆయన సోదరుడు గోవింద్ కందా పరాజయం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement