రాజుల కోటలో కాషాయ రెపరెపలు | BJP set for landlside victory in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజుల కోటలో కాషాయ రెపరెపలు

Dec 8 2013 1:19 PM | Updated on Sep 2 2017 1:24 AM

రాజుల కోటలో కాషాయ రెపరెపలు

రాజుల కోటలో కాషాయ రెపరెపలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష  హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యాహ్నం 1 గంటకు అందించిన వివరాల ప్రకారం బీజేపీ మూడు స్థానాలు గెలిచింది. 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 28 సీట్లలో లీడింగ్లో కొనసాగుతోంది.

నేషనల్ పీపుల్స్ పార్టీ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గంగాధర్ సాదుల్షహర్, పింద్వారా-అబూ, రియోడర్(ఎస్సీ) స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. తమ పార్టీ విజయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం అశోక్ గెహ్లట్, బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తమ తమ స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement