బీఎస్పీతో కలిసే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్‌ | BJP not alliance with BSP, says rajnath singh | Sakshi
Sakshi News home page

బీఎస్పీతో కలిసే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్‌

Feb 28 2017 6:38 PM | Updated on Aug 14 2018 9:04 PM

బీఎస్పీతో కలిసే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్‌ - Sakshi

బీఎస్పీతో కలిసే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్‌

బీఎస్పీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ లో బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అన్నారు. గతంలో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని పేర్కొన్నారు. వ్యూహంలో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని అన్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రజలు స్వాగతించారని చెప్పారు.

సర్జికల్ దాడులను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే బీజేపీ, బీఎస్పీ చేతులు కలపాలని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్ పీఐ) నేత రాందాస్ అథవాలే సూచించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement