
130 సీట్లు ఇస్తాం... సరేనా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై దోబూచులాట కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై దోబూచులాట కొనసాగుతోంది. చిరకాల మిత్రపక్షం శివసేన కోసం కమలం పార్టీ ఒక మెట్టు దిగింది. 151 స్థానాల్లో పోటీ చేసి తీరుతామని బెట్టు చేస్తున్న శివసేనను శాంతింపజేసేందుకు ఒక ప్రతిపాదన చేసింది. 130 సీట్లు కేటాయిస్తామని మధ్యేమార్గంగా ప్రతిపాదించింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు ప్రతాప్ రూడీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు.
అయితే దీనిపై శివసేన వెంటనే స్పందించలేదు. సీట్ల సర్దుబాటుపై ఒకపక్క పీటముడి కొనసాగుతుండగా శివసేనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా ప్రతిపాదనను శివసేన అంగీకరిస్తుందో, లేదో చూడాలి.