క్లైమాక్స్‌ షూటింగ్‌లో పెనువిషాదం..! | big accident in climax shooting | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ షూటింగ్‌లో పెనువిషాదం..!

Nov 7 2016 5:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

క్లైమాక్స్‌ షూటింగ్‌లో పెనువిషాదం..! - Sakshi

క్లైమాక్స్‌ షూటింగ్‌లో పెనువిషాదం..!

అది భారీ రిజర్వాయర్‌. ప్రముఖ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ అక్కడ జరుగుతోంది.

అది భారీ రిజర్వాయర్‌. ప్రముఖ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ అక్కడ జరుగుతోంది. హెలికాప్టర్‌ షాట్‌ను చిత్రీకరిస్తున్నారు. హెలికాప్టర్‌ నుంచి హీరోతోపాటు ఇద్దరు విలన్లు దూకారు. దూకడం వరకు దర్శకుడు ప్లాన్‌ చేసుకున్నట్టే జరిగింది. కానీ, హెలికాప్టర్‌ నుంచి దూకిన తర్వాతే పెనువిషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ నుంచి దూకిన ఇద్దరు నటులు చెరువులో ఈదుతూ.. గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అతికష్టం మీద హీరో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెప్పపాటులో కళ్లముందే కెమెరాలు చిత్రీకరిస్తుండగా ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర దిగ్బ్రాంతికర ఘటన కర్ణాటకలో జరిగింది.

ప్రముఖ కన్నడ హీరో దునియ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "మాస్తీగుడి' . బెంగళూరుకి 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్‌లో సోమవారం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతుండగా అనుకోని ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ నుంచి హీరోతోపాటు ఇద్దరు నటులు ఉదయ్‌, అనిల్‌ రిజర్వాయర్‌లోకి దూకారు. అయితే, ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగా, ఇద్దరు నటులు మాత్రం రిజర్వాయర్‌లో మునిగి చనిపోయారు. ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంత పరిచింది. మరోవైపు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇంత రిస్కీ షాట్‌ చిత్రీకరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమదం నేపథ్యంలో చిత్రయూనిట్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు నటులు.......................................................ప్రమాదం నుంచి బయటపడ్డ హీరో దునియ విజయ్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement