మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్ | Bayer's Open Offer Triggers Rally In Monsanto India Shares | Sakshi
Sakshi News home page

మోన్ శాంటోకి బేయర్ బంపర్ ఆఫర్

Sep 21 2016 11:53 AM | Updated on Sep 4 2017 2:24 PM

మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్

మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్

జర్మన్ ఫార్మా అండ్ కెమికల్ దిగ్గజం బేయర్ గ్రూప్ మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.1,100 కోట్లతో మోన్ శాంటో లోని 26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు.

ముంబై: జర్మన్  ఫార్మా అండ్ కెమికల్  దిగ్గజం  బేయర్ గ్రూప్   మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.  రూ.1,100 పైగా కోట్లతో మోన్ శాంటో లోని  26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ  ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. బీటీ విత్తన దిగ్గజం మోన్‌శాంటో వాటాదారులకు  బేయర్ గ్రూప్ ఈ  ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించడంతో మోన్ శాంటో ఇండియా  షేర్లు  ఇంట్రాడేలో 6 శాతం పైగా ర్యాలీ అయ్యాయి.

ఈ ఓపెన్ ఆఫర్ కింద, బేయర్ రూ 2,481.60 ధరకు  వాటాదారుల నుండి దాదాపు 44.88 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది గత మంగళవారం నాటి మోన్ శాంటో ధరకు దాదాపు 4 శాతం అదనం. భారత నిబంధనల ప్రకారం, ఒక సంస్థ మరో లిస్టెడ్ కంపెనీలోని 15 శాతం వాటావరకు పొందినట్లయితే అది ఓపెన్ ఆఫర్ గా పరిగణించబడుతుంది.

కాగా  బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ , అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్‌శాంటో  విలీనానికి 66 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరిన సంగతి  తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement