బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్ | Batman drives Sikh groom to his wedding in a Batmobile | Sakshi
Sakshi News home page

బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్

Oct 28 2015 10:19 AM | Updated on Sep 3 2017 11:38 AM

బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్

బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్

పెళ్లి జీవితంలో వచ్చే అత్యంత అరుదైన ఘట్టం. దానిని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలనుకున్నాడేమో ఈ పెళ్లికొడుకు. సూపర్హీరో బ్యాట్మన్ డ్రైవర్గా పెట్టుకొని బ్యాట్ మొబైల్ వాహనంలో అత్యంత ఘనంగా పెళ్లిమంటపానికి వచ్చాడు పవన్దీప్ సింగ్.

పెళ్లి జీవితంలో వచ్చే అత్యంత అరుదైన ఘట్టం. దానిని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలనుకున్నాడేమో ఈ పెళ్లికొడుకు. సూపర్హీరో బ్యాట్మన్ డ్రైవర్గా పెట్టుకొని బ్యాట్ మొబైల్ వాహనంలో అత్యంత  ఘనంగా పెళ్లిమంటపానికి వచ్చాడు పవన్దీప్ సింగ్. బాజాభజంత్రిలతో బరాత్ ముందు సాగుతుండగా.. అత్యంత వినూత్నమైన బ్యాట్ మొబైల్లో పెళ్లి మంటపానికి వచ్చిన ఆయన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

లండన్లోని హౌన్స్లోకు చెందిన పవన్దీప్-సందీప్ కౌర్ వివాహం గత సెప్టెంబర్ 12న  జరిగింది. ఈ వివాహంలో అందరినీ ఆకర్షించింది బ్యాట్మన్ సినిమాలో ఉపయోగించిన బ్యాట్ మొబైల్ వాహనం. ఈ వాహనాన్ని బ్యాట్మన్ వేషధారి నడుపుతూ వరుడిని పెళ్లిమంటపం దగ్గర దింపాడు. ఈ అరుదైన పెళ్లికొడుకు వీడియో ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నది. మొత్తానికి ఈ వినూత్న ప్రయత్నం ఆయన వివాహాన్ని ఓ మధురస్మృతిగా మార్చి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement