breaking news
batmobile
-
బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్
పెళ్లి జీవితంలో వచ్చే అత్యంత అరుదైన ఘట్టం. దానిని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలనుకున్నాడేమో ఈ పెళ్లికొడుకు. సూపర్‌హీరో బ్యాట్మన్ డ్రైవర్‌గా పెట్టుకొని బ్యాట్ మొబైల్ వాహనంలో అత్యంత ఘనంగా పెళ్లిమంటపానికి వచ్చాడు పవన్‌దీప్ సింగ్. బాజాభజంత్రిలతో బరాత్ ముందు సాగుతుండగా.. అత్యంత వినూత్నమైన బ్యాట్ మొబైల్లో పెళ్లి మంటపానికి వచ్చిన ఆయన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. లండన్‌లోని హౌన్స్లోకు చెందిన పవన్‌దీప్-సందీప్ కౌర్ వివాహం గత సెప్టెంబర్ 12న జరిగింది. ఈ వివాహంలో అందరినీ ఆకర్షించింది బ్యాట్మన్ సినిమాలో ఉపయోగించిన బ్యాట్ మొబైల్ వాహనం. ఈ వాహనాన్ని బ్యాట్మన్ వేషధారి నడుపుతూ వరుడిని పెళ్లిమంటపం దగ్గర దింపాడు. ఈ అరుదైన పెళ్లికొడుకు వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నది. మొత్తానికి ఈ వినూత్న ప్రయత్నం ఆయన వివాహాన్ని ఓ మధురస్మృతిగా మార్చి ఉంటుంది. -
సర్దార్జీ పెళ్లా మజాకా!
పెళ్లంటే? పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, బ్యాండ్ బాజా బారాత్‌లు.. ఆగండాగండి.. ఇది మీరనుకునే మామూలు పెళ్లి కాదు. సర్దార్జీ షాదీ! తాళి, తలంబ్రాల మాటేమోగానీ, బారాత్ (ఊరేగింపు)లో ఈయన సృష్టించిన అలజడి (నిజానికి సందడి అనాలేమో) అంతా ఇంతాకాదు! ఇంతకీ సర్దార్జీ ఏం చేశారంటే.. సాధారంణంగా ఏ గుర్రంపైనో లేదంటే టాప్‌లెస్ కారులోనే ఊరేగింపుగా వస్తారు పెళ్లికొడుకులు. ఈయన మాత్రం బ్యాట్‌మొబైల్‌లో వచ్చాడు. బ్యాట్ మొబైల్ అంటే ఏమిటో తెలుసుగా.. కామిక్ హీరో బ్యాట్మన్ వాహనం! మరి ఆ వాహనాన్ని మామూలు మనుషులు నడపలేరు. కాబట్టి.. బ్యాట్మన్ చేతే వాహనాన్ని డ్రైవ్ చేయించాడు సర్దార్జీ! వరుడి బంటు పాత్రలో ఒద్దికగా ఒదిగిపోయిన బ్యాట్మన్.. పెళ్లి కూతురి ఇల్లు రాగానే 'మహారాజరాజశ్రీ సర్దార్జీ గారు వేంచేశారహో..' అంటూ పెద్ద పెట్టున అరిచి సందడిలో మునిగిపోయిన పెళ్లింటి వారిని అలర్ట్ చేశాడు. కార్ డోర్ తెరిచి.. బ్లింగ్ అవుతున్న సింగ్ గారిని పెళ్లింటిలోకి పంపేశాడు. ఏ ఊళ్లో జరిగిందీ, ఆ సర్దార్జీ పేరు ఇతర వివరాలు లేకుండా 'అర్బన్ సర్దార్జీ' ఫేస్బుక్ పేజ్ లో అప్ లోడ్ అయిన ఈ బారాత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.