సర్దార్జీ పెళ్లా మజాకా! | This Singh is King of the Wedding Entrance | Sakshi
Sakshi News home page

సర్దార్జీ పెళ్లా మజాకా!

Oct 27 2015 4:54 PM | Updated on Sep 3 2017 11:34 AM

సర్దార్జీ పెళ్లా మజాకా!

సర్దార్జీ పెళ్లా మజాకా!

ఇది మీరనుకునే మామూలు పెళ్లి కాదు. సర్దార్జీ షాదీ! తాళి, తలంబ్రాల మాటేమోగానీ, బారాత్ (ఊరేగింపు)లో ఈయన సృష్టించిన అలజడి అంతాఇంతాకాదు!

పెళ్లంటే? పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, బ్యాండ్ బాజా బారాత్లు.. ఆగండాగండి.. ఇది మీరనుకునే మామూలు పెళ్లి కాదు. సర్దార్జీ షాదీ! తాళి, తలంబ్రాల మాటేమోగానీ, బారాత్ (ఊరేగింపు)లో ఈయన సృష్టించిన అలజడి (నిజానికి సందడి అనాలేమో) అంతా ఇంతాకాదు! ఇంతకీ సర్దార్జీ ఏం చేశారంటే..

సాధారంణంగా ఏ గుర్రంపైనో లేదంటే టాప్లెస్ కారులోనే ఊరేగింపుగా వస్తారు పెళ్లికొడుకులు. ఈయన మాత్రం బ్యాట్మొబైల్లో వచ్చాడు. బ్యాట్ మొబైల్ అంటే ఏమిటో తెలుసుగా.. కామిక్ హీరో బ్యాట్మన్ వాహనం! మరి ఆ వాహనాన్ని మామూలు మనుషులు నడపలేరు. కాబట్టి.. బ్యాట్మన్ చేతే వాహనాన్ని డ్రైవ్ చేయించాడు సర్దార్జీ! వరుడి బంటు పాత్రలో ఒద్దికగా ఒదిగిపోయిన బ్యాట్మన్.. పెళ్లి కూతురి ఇల్లు రాగానే 'మహారాజరాజశ్రీ సర్దార్జీ గారు వేంచేశారహో..' అంటూ పెద్ద పెట్టున అరిచి సందడిలో మునిగిపోయిన పెళ్లింటి వారిని అలర్ట్ చేశాడు. కార్ డోర్ తెరిచి.. బ్లింగ్ అవుతున్న సింగ్ గారిని పెళ్లింటిలోకి పంపేశాడు.


ఏ ఊళ్లో జరిగిందీ, ఆ సర్దార్జీ పేరు ఇతర వివరాలు లేకుండా 'అర్బన్ సర్దార్జీ' ఫేస్బుక్ పేజ్ లో అప్ లోడ్ అయిన ఈ బారాత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement