వాట్సప్ మెసేజ్లు 'డ్రైవ్'లో బ్యాకప్! | backup your WhatsApp messages on Android to Google Drive | Sakshi
Sakshi News home page

వాట్సప్ మెసేజ్లు 'డ్రైవ్'లో బ్యాకప్!

Oct 9 2015 7:01 PM | Updated on Sep 3 2017 10:41 AM

వాట్సప్ మెసేజ్లు 'డ్రైవ్'లో బ్యాకప్!

వాట్సప్ మెసేజ్లు 'డ్రైవ్'లో బ్యాకప్!

వాట్సప్ మెసెజ్లు, వీడియోలు, ఫొటోలు నేరుగా గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాట్సప్ మెసెజ్ హిస్టరీని బ్యాకప్ (నిల్వ) చేసుకోవాలంటే చాలా కష్టమైన పనే. దీనికి పెద్ద మాన్యువల్ ప్రాసెస్సే కావాలి. మీ మొబైల్ ఫోన్ను కంప్యూటర్కు కనెక్ట్ చేసి.. ఫోన్ మెమరీలోని వాట్సప్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ సిస్టంలోకి సేవ్ చేసుకోవాలి.

ఈ జంఝాటం అంతా లేకుండా వాట్సప్ మెసెజ్లు, వీడియోలు, ఫొటోలు నేరుగా గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఐ-ఫోన్లో వాట్సప్ మెసెజ్లను బ్యాకప్ చేసుకోవడానికి ఐ-క్లౌడ్ పేరిట ఒక ఆప్షన్ ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ బ్యాకప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. తమ భాగస్వామ్యంలో త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని గూగుల్, వాట్సప్ ఇటీవల ప్రకటించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement