breaking news
messages backup
-
సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు
వాట్సాప్ లో కొన్నిసార్లు డిలీట్ మెసేజ్ లను చదవాల్సి వస్తుంది. వాట్సాప్ మాత్రం డిలీట్ అయిన మెసేజ్ లను మళ్లీ ఓపెన్ చేసి చదివేలా ఆప్షన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ చిన్నట్రిక్ తో డిలీట్ మెసేజ్ లను చదవచ్చు.ఆండ్రాయిడ్ ఫోన్ లలో మాత్రమే సదుపాయం ఉంది. 1. ముందుగా గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లాలి. గూగుల్ ప్లేస్టోర్ లో నోటిసేవ్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. ఇన్ స్టాల్ చేసుకున్న అనంతరం నోటిసేవ్ యాప్ సాయంతో నోటిఫికేషన్లు, ఫోటోలు, మీడియా మరియు ఫైల్స్ చదివేలా మీరు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 3. అది పూర్తయితే డిలీటెడ్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంది. . 4. మీరు అనుమతులు ఇచ్చిన వెంటనే వాట్సాప్ తో పాటూ ప్రతి ఒక్క మెసేజ్ ను స్టోర్ చేసుకుంటుంది. వాటిని మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కాకపోతే డిలీటెడ్ వాట్సాప్ మెసేజ్ లను తిరిగిపొందాలంటే నెలకు రూ.65 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా జిఫ్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ తిరిగి పొందవచ్చు. చదవండి : వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
ఎస్ఎంఎస్లను స్మార్ట్‌గా దాచుకోండి..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : మొబైల్ మన వెంట ఉంటే ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలా పనులు దానితోనే కానిచ్చేస్తున్నారు. వివిధ పనుల షెడ్యూల్, రిమైండర్, అనుకున్న సమయానికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోవడం, టైం చూసుకోవడం, అలారం ఇలా ఒకటేమిటీ చాలా రకాల పనులను ఇట్టే చేసుకునే వీలు కలిగింది. అలాగే మనకు ప్రతి రోజు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని దాచుకోవడానికి, అనుకోకుండా మనకు కావాల్సి ఎస్ఎంఎస్లు డిలీట్ అయితే వాటిని తిరిగి బ్యాకప్ చేసుకోవడం వంటివి చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన యాప్‌ల ద్వారా డెలిట్ అయిన మన ఫోన్ నంబర్లు, ఎస్ఎంఎస్లను తిరిగి పొందవచ్చు. కాంటాక్టు నంబర్లు, ఎస్ఎంఎస్, ముఖ్యమైన సమాచారం గుట్టుగా భద్రపరుకోవడం కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి రేటింగ్ ఉన్న యాప్‌ల గురించి తెలుసుకుందాం... ఎస్ఎంఎస్ల బ్యాకప్ ఇలా... సాధారణంగా మనకు రోజుకు ఎన్నో టెక్ట్స్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని రహస్యంగా స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నా..ఫోన్ దెబ్బతిన్న సందర్భాల్లో అవసరమైన మెసెజ్‌లు పోగొట్టుకోకుండా ఉండాలన్నా తోడ్పడే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్లౌడ్ స్టోరేజీలో, ఫోన్, మెమోరీ కార్డుల్లో ఎస్ఎంఎస్ డాటా స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. మరికొన్నింటిలో అయితే నిర్ణిత సమయంలో మన ఎస్ఎంఎస్లను మన ఈ మెయిల్‌ను పంపిస్తాయి.మెయిల్ ఓపెన్ చేసుకుని వాటిని చూసుకోవచ్చు.రోజు,రెండు రోజులకోసారి,వారానికి ఒకసారి ఎలాగైనా మన బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని ఎస్ఎంఎస్ బ్యాకప్‌లలో కాల్ వివరాలు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంది. రేటింగ్ యాప్‌లు... ఎస్ఎంఎస్ బ్యాకప్ ప్లేస్, ఎస్ఎంఎస్ బ్యాకప్ రీస్టోర్, సీఎం బ్యాకప్, ఈజీ బ్యాకప్ అండ్ రీస్టీర్, సూపర్ బ్యాకప్, ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ మొదలైన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్... ఇందులో బ్యాకప్‌తో పాటు మరో అద్బుతమైన ఫీచర్ ఉంది. దీనిలో ఏవైనా కొన్ని కాంటాక్ట్‌లు జత చేసుకోవచ్చు. దానితో ఆ కాంటాక్ట్ నెంబర్ల నుంచి ఎస్ఎంఎస్లు ఫోన్ ఇన్‌బాక్స్‌లో కనిపించవు. వేరుగా ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో చూడవచ్చు. ఈ యాప్‌కు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్ఎంఎస్ టూ టెక్టస్ యాప్... దీనిలో మరో అదనపు సౌకర్యం ఉంది. ఈ యాప్ ద్వారా మన ఇన్‌బాక్స్‌లోని ఎస్ఎంఎస్లు అన్నింటినీ టెక్టŠస్ ఫైల్ రూపంలో పొందవచ్చు. అంటే ఆ ఫైల్ మరో ఫోన్లో అయినా కంప్యూటర్లో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. వందల రకాల యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మన అవసరానికి అనుగుణంగా ఉండే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే మంచింది. -
వాట్సప్ మెసేజ్‌లు 'డ్రైవ్'లో బ్యాకప్!
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాట్సప్ మెసెజ్ హిస్టరీని బ్యాకప్ (నిల్వ) చేసుకోవాలంటే చాలా కష్టమైన పనే. దీనికి పెద్ద మాన్యువల్ ప్రాసెస్సే కావాలి. మీ మొబైల్ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి.. ఫోన్ మెమరీలోని వాట్సప్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ సిస్టంలోకి సేవ్ చేసుకోవాలి. ఈ జంఝాటం అంతా లేకుండా వాట్సప్ మెసెజ్‌లు, వీడియోలు, ఫొటోలు నేరుగా గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఐ-ఫోన్లో వాట్సప్ మెసెజ్‌లను బ్యాకప్ చేసుకోవడానికి ఐ-క్లౌడ్ పేరిట ఒక ఆప్షన్ ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ బ్యాకప్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. తమ భాగస్వామ్యంలో త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని గూగుల్, వాట్సప్ ఇటీవల ప్రకటించాయి.