బాబే బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి | babu is responsible : kisanreddy | Sakshi
Sakshi News home page

బాబే బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

Jul 15 2015 2:29 AM | Updated on Mar 29 2019 9:31 PM

బాబే బాధ్యత వహించాలి:  కిషన్‌రెడ్డి - Sakshi

బాబే బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంతో తొలిరోజునే రాజమండ్రి ఘటన జరిగిందని బీజేపీ తెలంగాణ ...

సూర్యాపేట: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంతో తొలిరోజునే రాజమండ్రి ఘటన జరిగిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు.

పుష్కరాలకు ఎన్నడూలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం చేశారేకానీ ఏర్పాట్లు మాత్రం చేయలేదన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజునే పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడం అక్కడ ఏర్పాట్ల వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement