ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం.. కిషన్‌ రెడ్డి | Government's failure in grain procurement | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యం.. కిషన్‌ రెడ్డి

Jul 8 2026 4:19 PM | Updated on Jul 8 2026 4:22 PM

Government's failure in grain procurement

సాక్షి, ఢిల్లీ: 53 లక్షల మెట్రిక్ టన్నుల కొనగోలుకు  కేంద్రం అంగీకారం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు గోస ఉద్యమం తరువాతనే  రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేసిందన్నారు.రైస్ మిల్లులలో మిల్లింగ్ వేగవంతం చేసి FCI కి బియ్యాన్ని పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందని తెలిపారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు విషయంలో ,మిల్లింగ్ విషయంలో పక్కా వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి.ఖరీఫ్ 2024-25 36 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు అంగీకరిస్తే ఈరోజు వరకు 13-14 శాతం బియ్యం పంపలేదు.2024-26 ఖరీఫ్ సీజన్ బియ్యం ఇంకా FCI కి చేరలేదు. గతంలో బిఆర్ ఎస్ ఇదేవిధంగా వ్యవహరించింది. ధాన్యం కొనుగోళ్ల కోసం NCDC ద్వారా రాష్ట్రాలకు కేంద్రం రుణాలిస్తుంది.2024-26 లో  37 వేల కోట్లు రాష్ట్రానికి రుణాలు ఇచ్చాం" అన్నారు.

2026-27 లో కూడా సుమారు 23 వేల కోట్లు రుణాలు ఇచ్చామని ఢిల్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ధర్నా చెయ్యండని అప్పడు వాస్తవాలు చెబుతామని పేర్కొన్నారు. కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందని. రైతుల ధాన్యం ఉత్పత్తి స్థాయికి తగ్గట్టు మౌలిక వసతులు పెంచాలని. పేదలకు ఇచ్చే సన్నబియ్యంలో 70 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

కాగా ఈ రోజు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం కలిసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, తెలంగాణ బిజెపి కిసాన్ మోర్చా నేతలు కేంద్రమంత్రిని కలిసి ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌కి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement